నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామానికి చెందిన సురేంద్ర.. ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. కరోనా కారణంగా ప్రైవేట్ స్కూల్స్ మూసివేయడంతో.. బతుకుదెరువు కోసం ఉపాధిహామీ పనికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పేరు నమోదు చేసుకునేందుకు.. ఫిల్డ్ అసిస్టెంట్ దగ్గరకు వెళ్లగా.. అప్పటికే పేరు నమోదైందని.. ఎంపీడీవో ఆఫీస్కు వెళ్లి కలవాలని సూచించారు.
ఎంపీడీవో ఆఫీస్కు వెళ్లీ ఈజీఎస్ సిబ్బందిని కలవగా.. కంప్యూటర్లో చూశారు. అతని పేరు నమోదవ్వడమే కాకుండా.. రికార్డుల్లో మృతిచెంది ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలుసుకున్న బాధితుడు.. బతికి ఉండగానే చంపేస్తారా..? అని అధికారులను నిలదీశాడు. 15 రోజుల్లో సరిచేస్తామని అధికారులు హామీఇవ్వగా వెనుదిరిగాడు.
ఇదీ చదవండీ... 'ఆనందయ్య మందు తితిదే ఆధ్వర్యంలో తయారు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'