నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, మోడల్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్పేర్ కళాశాలలు 212 వరకు ఉన్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్ధులు 29వేల మంది ఉన్నారు. నవంబర్ రెండో తేదీ నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. 80 శాతం మంది తరగతులకు హాజరవుతున్నారు. జిల్లాలోని అన్ని కళాశాలలను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేశారు. తరగతి గదికి 16 మంది విద్యార్ధులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఉదయం పూట సైన్స్ విద్యార్ధులకు. రెండో పూట ఆర్ట్స్ విద్యార్ధులకు బోధన సాగిస్తున్నారు. కళాశాలకు వచ్చిన విద్యార్ధికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో విద్యార్దుల తల్లితండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ తరగతులకు హాజరు కావాలని పిలుపునిస్తున్నారు.
టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కొవిడ్ నిబంధనలు పరిశీలనకు టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలను వీరు పరిశీలిస్తున్నారు. పని దినాలను తగ్గించారు. 220 పనిదినాలను 137కు తగ్గించి విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. 30శాతం సిలబస్ తగ్గించడంతో విద్యార్ధులకు కొంత ఊరట కలిగింది. బౌతిక దూరం పాటించడానికి బెంచ్‌కి ఒక్కరు మాత్రమే కూర్చుంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలంటే పారిశుద్ద్యం మెరుగుపరచాలి. ప్రతి కళాశాలలో స్వీపర్, వాచ్ మెన్ కొరత ఉంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి సిబ్బంది లేరు.
కొవిడ్‌తో విద్యార్థులకు నాలుగు నెలల కాలం వృథా మారింది. ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ నాటికి సిలబస్ పూర్తి చేయాల్సి ఉంది. అందులోనూ ఈ నెల 16తరువాత మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యే అవకాసం ఉంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహించాలంటే గదులు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఏప్రిల్ నాటికి నిర్ణయించుకున్న సిలబస్ పూర్తి చేసి ఈ విద్యా సంవత్సరాన్ని గట్టెక్కించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ల్యాబ్, తరగతి గదుల సమస్య వంటివి వాటిపై ప్రత్యేక నివేదికను తయారు చేసి...రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
ఇదీ చదవండి: