నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయాన్ని జిల్లా పాలనాధికారి చక్రధర్ బాబు పరిశీలించారు. జిల్లా కలెక్టర్గా పదవి భాద్యతలు చేప్పట్టిన తొలిసారిగా ఆయన సోమశిల జలాశయాన్ని పరిశీలించి, జలాశయ నీటి వివరాలను ప్రాజెక్టు ఇంజనీర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు. దక్షిణ కాలువ, ప్రాజెక్ట్ కంట్రోల్ రూమ్, గేట్ల పనితీరును పరిశీలించారు. ఈ ఏడాది జలాశయంలో 26 టీఎంసీల నీటి నిల్వ ఉందని, నెల్లూరు జిల్లా ప్రజలకు తాగునీటికి ఎలాంటి డోకా లేదని పేర్కొన్నారు. అదేవిధంగా డెల్టా ఆయకట్టుకు కూడా ఈ సారి పంటకు సాగు నీరు అందించేందుకు సన్నాహాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. నాన్ డెల్టాలు అయిన ఉత్తర, దక్షిణ కాలువలకు కూడా నీరందించే విధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వివరించారు.
ఇదీ చదవండి: