నెల్లూరు జీజీహెచ్లో సీటీ స్కాన్ పరీక్షల సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. జిల్లాలో కరోనా ఆసుపత్రులతో పాటు కావలి, ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు రెవెన్యూ డివిజన్లలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
2,513 పడకల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కేటగిరి-బీలో ఉన్న నారాయణ ఆసుపత్రిని కేటగిరి-ఏ లోకి మార్చినట్లు వివరించారు. 104, 1077 కి కాల్ చేస్తే.. కరోనా చికిత్సకు సంబంధించి పూర్తి వివరాలు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: