ETV Bharat / state

CITU Leader Gafoor: 'జెన్​కోను ప్రైవేటుపరం చేయాలనుకోవటం దారుణం' - జెన్​కోను ప్రైవేటుపరం చేయాలనుకోవటం దారుణం

బొగ్గు కొరతతో నష్టాలు సాకుగా చూపి జెన్​కోను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దారుణమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మండిపడ్డారు. ముందు చూపులేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తూ.., ప్రజా ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

జెన్​కోను ప్రైవేటుపరం చేయాలనుకోవటం దారుణం

author img

By

Published : Feb 13, 2022, 5:36 PM IST

ముందు చూపులేని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తూ.., ప్రజా ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ విమర్శించారు. జెన్​కో థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ నెల్లూరులో నిర్వహించిన కార్మిక సంఘాల సదస్సుకు ఆయన హాజరయ్యారు. బొగ్గు కొరతతో నష్టాలు సాకుగా చూపి జెన్​కోను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దారుణమన్నారు.

జెన్​కోలో 3.40 రూపాయలకే విద్యుత్ ఉత్పత్తి అవుతోందని.., అదే ప్రైవేటు వారికి అప్పగిస్తే రూ.10 వరకు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. నెల్లూరు జిల్లాలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న జెన్​కోను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ పోరాడాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను విడనాడకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి

కంట్రోల్ రూం పరికరాలు చోరీ.. అమరావతి రైతుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.