తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరో రోజు... నెల్లూరు జిల్లా గూడూరులో ప్రచారం నిర్వహించారు. ర్యాలీ, బహిరంగ సభకు పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరాగా... పసుపు జెండాలతో పట్టణం నిండిపోయింది. స్థానిక ఎమ్మెల్యే రీటైల్‌గా అవినీతికి పాల్పడుతుంటే.... సీఎం జగన్‌ది హోల్‌సేల్ వ్యవహారమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో నిర్మించిన భవనాలకు రంగులు వేయడమే 'నాడు - నేడు' పథకమా అని ప్రశ్నించారు. పథకాల పేరిట ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కనీసం వైఎస్ వివేకా హత్య కేసునైనా నిగ్గుతేల్చండి..
రాళ్లదాడి ఘటనపై ఫిర్యాదు చేస్తే తనకే తిరిగి నోటీసులు ఇచ్చారన్న చంద్రబాబు.. పోలీసుల తీరును తప్పుబట్టారు. కనీసం కోడికత్తి కేసు, వైఎస్ వివేకా హత్య కేసులైనా నిగ్గు తేల్చాలని హితవు పలికారు. పోలింగ్ సమయంలో మనకెందుకులే అనుకొని ఎవరైనా ఓటింగ్‌కు దూరంగా ఉంటే.. భవిష్యత్తే అంధకారం అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి:
ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్