వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రాష్ట్రం మనదని.. ఆంధ్రప్రదేశ్ జీఎస్‌డీపీకి రైతులే వెన్నెముక అని చంద్రబాబు అన్నారు. వరుసగా 4 ఏళ్లు రెండంకెల వృద్ధిరేటుకు వ్యవసాయంలో పురోగతే కారణమన్న తెదేపా అధినేత.. వైకాపా హయాంలో రైతుల వెన్ను విరిచేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర పాలకులు మొద్దునిద్ర నుంచి మేల్కొనాలని హితవు పలికారు. యుద్ధ ప్రాతిపదికన స్పందించి నెల్లూరు జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. పుట్టి ధాన్యానికి రూ.16 వేల కనీస మద్దతు ధర లభించేలా శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. తూకాలలో మోసాలు జరగకుండా చూడాలని.. దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విశాఖ సముద్రంలో టోర్నడో... ఆసక్తిగా తిలకించిన స్థానికులు