వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నెల్లూరు జిల్లా తెదేపా కార్యకర్త శ్రీకాంత్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేసి బెదిరించడంపై ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం నేతల అరెస్టుల విషయంలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. తాను ఏ తప్పు చేయలేదని... ఎలాంటి బెదిరింపులకు లొంగేదిలేదంటూ తెదేపా కార్యకర్త శ్రీకాంత్ ఫోన్లో పోలీసులకు సమాధానం ఇచ్చిన ఆడియో వైరల్ అయింది. దీనిని విన్న చంద్రబాబు..ఆ యువ కార్యకర్తకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.
పోలీసులకు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గుర్తుచేశారు. మీరు చూపిన ధైర్యానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా భావ ప్రకటనా స్వేచ్ఛని కాపాడుకోవడానికి మాట్లాడారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాసే అధికారం ఎవరికీ లేదు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. ఏం జరిగినా మాతో చెప్పండి. మేం చూసుకుంటాం - శ్రీకాంత్తో ఫోన్లో చంద్రబాబు
ఇదీ చదవండి: