Central Team Visit Michaung Cyclone Affected Areas : ఆరుగాలం కష్టపడి సాగు చేసినా పంట చేతికి వస్తుందో లేదో నమ్మకం లేకుండా పోయిందని కేంద్ర బృందానికి నెల్లూరు జిల్లా రైతులు గోడు వెల్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేసినా ప్రకృతి విపత్తులు కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని వాపోయారు. మిగ్‌జాం తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయినట్లు కేంద్ర బృందానికి అన్నదాతలు విన్నవించారు. తుపాను నష్టాన్ని అంచనా వేస్తున్న బృందానికి ఎక్కడికి వెళ్లినా రైతన్నల ఆక్రందనలే వినిపించాయి.
Nellore District Farmers Problems with Cyclone : మిగ్‌జాం తుపాను ప్రభావంతో రైతన్నలు తీవ్రస్థాయిలో నష్టపోయారు. దీంతో వారికి కన్నీళ్లే మిగిలాయి. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసేందుకు రాజేంద్ర రత్నూ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం నెల్లూరులో పర్యటించింది. కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటను అధికారులు పరిశీలించారు. పంట నష్టం వివరాలను జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, కేంద్ర బృందంలోని సభ్యులు రాజేంద్ర రత్నూ, విక్రమ్ సింగ్‌లకు వివరించారు.
కరవు నివారణ చర్యలపై అధికారులకు కేంద్ర బృందం సూచనలు - నేడు నంద్యాల జిల్లాలో పర్యటన
Farmers Problems with Heavy Rains in Andhra Pradesh : కోవూరు, సర్వేపల్లి, ఇనమడుగు, లేగుంటపాడు, చెర్లోపల్లి ప్రాంతాల్లో దెబ్బతిన్న అరటి, తమలపాకు తోటలను కేంద్ర బృందం పరిశీలించింది. జగదేవిపేట విద్యుత్ సబ్ స్టేషన్ లో జరిగిన నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. ఇందుకూరుపేటలో కూలిన ఇంటిని పరిశీలించారు. కొత్తూరులోని బీసీ కాలనీలో తుపాను ధాటికి దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీక్షించారు. వెంకటాచలం మండలం పూలతీగలపాడు వద్ద కనుపూరు కాలువకు పడిన గండి వివరాలను ఇరిగేషన్ అధికారులు, కేంద్ర బృందానికి వివరించారు.
Central Officials Assess Damage Crop Caused by Cyclone : తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను జాయింట్ కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. 27 మండలాల్లో 15వేల 284 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వాటిలో ఉద్యాన పంటలు 4వేల26 హెక్టార్లు, వరి 81 హెక్టార్లు, మినుము 718 హెక్టార్లు, పొగాకు 18 వందల39 హెక్టార్లు, వేరు శనగ 382 హెక్టార్లు, నిమ్మ 13వందల51 హెక్టార్లు, అరటి 295 హెక్టార్లు, మిరప 17వందల 16 హెక్టార్లలో నీటమునిగినట్లు అధికారులు వివరించారు. నష్టం అంచనా సుమారు 147 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని కేంద్ర బృందం స్పష్టం చేసింది.