ఇవీ చదవండి:
ఆత్మకూరులో నిర్బంధ తనిఖీలు.. 50 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ మక్బుల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఏసీఎస్ఆర్ కాలనీ, వందురుగుంట, ఎరుకలసాని నగర్, క్రిస్టియన్ పేట ప్రాంతాల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని 50 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని కోర్టుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
ఆత్మకూరులో కార్డన్ సెర్చ్
ఇవీ చదవండి: