నెల్లూరు నగరంలోని డీసీసీబీ ఆవరణలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ శేషగిరిబాబు పాల్గొన్నారు. 2020- 21 సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను ప్రారంభించారు. 2020-21కి సంబంధించి జిల్లాకు రూ. 13,590 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. .
ఇందులో వ్యవసాయరంగానికి రూ.7,700 కోట్లు విడుదల చేశారు.
- పంట రుణాలకు రూ.5600 కోట్లు
- దీర్ఘకాలిక రుణాలు రూ. 1600 కోట్లు
- వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ. 200 కోట్లు
- వ్యవసాయ అనుబంధ శాఖలకు రూ. 300 కోట్లు అధికారులు కేటాయించారు.
పారిశ్రామిక రంగాలకు రూ. 5,890 కోట్లు విడుదల చేశామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: రబీకి వరి విత్తనాలు సిద్ధం చేస్తున్న ఏపీ సీడ్స్ అధికారులు