ETV Bharat / state

జొన్నవాడ క్షేత్రం చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - నెల్లూరు జిల్లాలో కిడ్నాప్ కేసు

ఈనెల 16న కిడ్నాప్​నకు గురైన ఎనిమిది నెలల చిన్నారి కేసును నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కడప జిల్లా వీరబల్లి మండలం, సోమవరంలో పాప ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురు నిందితులను గుర్తించగా.. వారిలో ముగ్గుర్నీ అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉన్నారు.

Buchireddypalem police
జొన్నవాడ క్షేత్రం చిన్నారి కిడ్నాప్ కేసు
author img

By

Published : Feb 25, 2021, 9:45 PM IST

ఎనిమిది నెలల చిన్నారి కిడ్నాప్ కేసును నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు ఛేదించారు. జొన్నవాడ క్షేత్రం వద్ద ఈనెల 16వ తేదీ రాత్రి తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న పాపను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. మరుసటి రోజు ఉదయం పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కడప జిల్లా వీరబల్లి మండలం, సోమవరం గ్రామంలో పాప ఆచూకీని పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో పాపను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఈ కేసులో నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరిని త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:

మర్రిపాడులో ఎస్​ఈబీ సోదాలు.. 3 ఇసుక లారీలు సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.