నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడులో ఏడాదిన్నర బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లిదండ్రులపై దాడి చేసిన ఓ జంట బాలుడిని ఎత్తుకుని పరారైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుడితిపాళెంకు చెందిన రమణయ్య దంపతులు చిత్తుకాగితాలు ఎరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రమణయ్య దంపతులు తమ పిల్లలతో కలిసి శనివారం మైపాడు ప్రాంతానికి వచ్చారు. అక్కడ వీరితో ఓ జంట మాటలు కలిపి పరిచయం చేసుకుంది. తల్లిదండ్రుల ఆదమరచి ఉన్న సమయంలో బాలుడిని అపహరించేందుకు వారు ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవటంతో రమణయ్య దంపతులపై దాడి చేసి ఏడాదిన్నర వయస్సున్న అంజి అనే బాలుడిని ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి