నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరులో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీమంత్రి రావెల కిషోర్ బాబు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ సామాన్య కుటుంబ నుంచి వచ్చిన వ్యక్తి అని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. పేదరికం నుంచి వచ్చిన మోదీ... పేదల సంక్షేమానికి కష్టపడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రాలు పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో పోలీసు పాలన సాగుతోంది: కన్నా