వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా... నేటికి ఒక అభివృద్ధి పని కూడా చేయలేదని భాజపా రాష్ట్ర సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధిని పాతాళంలోకి తొక్కారని నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్లో... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వ పథకాలకు పెయింటింగ్ వేసి మా పథకాలు అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల పట్టాల కోసం పది లక్షలకు ఎకరం భూమి కొనుగోలు చేసి, దాన్ని రూ.40 లక్షలకు అమ్ముకొని ప్రభుత్వ ధనాన్ని వైకాపా నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.
మద్యంపై ఇప్పటికి నాలుగు సార్లు ధరలు పెంచారని అన్నారు. ఇసుకపై కూడా నాలుగు సార్లు జీవోలు మార్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. భారత ప్రభుత్వం విడుదల చేసిన నిధులుపై ఎంత ఖర్చు చేశారో సీఎం జగన్ శ్వేతపత్రం విడుదల చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి హితవు పలికారు.
ఇదీ చదవండి: