ద్విచక్రవాహనం ఢీకొట్టి మహిళ మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగింది. పట్టణంలోని మంగళ కట్ట వీధికి చెందిన షేక్ మహబూబ్ జానీ (50) రోడ్డుపై నడుచుకుంటూ పంచాయతీ బస్ స్టాండ్ వైపు వెళ్తుండగా... అదే సమయంలో ద్విచక్రవాహనంపై మధు అనే యువకుడు ఆమెను వేగంగా ఢీకొట్టాడు.
కింద పడిన మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. యువకుడికి దేహశుద్ధి చేసిన స్థానికులు... పోలీసులకు అప్పగించారు. గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆత్మకూరు వైద్యశాలకు తీసుకువెళ్తుండగా... మార్గ మధ్యలో మరణించారు. ఘటనపై ఎస్సై మరిడి నాయుడు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: