ETV Bharat / state

‘దీపావళి కాలుష్యం’ నుంచి ఊపిరితిత్తులు జాగ్రత్త.. ఇవిగో చిట్కాలు - బాణసంచా తయారీ

Air pollution during Diwali festival: దీపావళి కాలుష్యంతో ఆస్తమా రోగులకే కాదు.. మామూలు వారిలోనూ కొన్ని శ్వాససంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. దగ్గు, శ్వాస పీల్చుకోలేకపోవడం, గురక, ఆస్తమా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

Air pollution during Diwali festival
దీపావళి కాలుష్యం
author img

By

Published : Oct 24, 2022, 3:25 PM IST

Air pollution during Diwali festival: దీపావళి పండగంటే ఇంటిల్లిపాదికీ ఆనందమే. మిఠాయిలు చేసుకోవడంతో పాటు టపాసులు కాల్చుతూ పిల్లలు, పెద్దలూ ఎంతో సందడి చేస్తుంటారు. అయితే, ఈ పండుగ హడావుడిలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా అధిక మోతాదులో బాణసంచా పేల్చడం, బయట తిరగడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీపావళి కాలుష్యంతో ఆస్తమా రోగులకే కాదు.. మామూలు వారిలోనూ కొన్ని శ్వాససంబంధమైన సమస్యలు తప్పవంటున్నారు. దగ్గు, శ్వాస పీల్చుకోలేకపోవడం, గురక, ఆస్తమా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

మాస్క్‌ తప్పనిసరి: ప్రతిఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. తద్వారా కరోనా వైరస్‌ని నియంత్రించడంతో పాటు కాలుష్యం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు మాస్కును తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీనివల్ల గాలిలో ఉన్న చిన్న చిన్న కణాలు మీ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది.

విటమిన్‌ సి: విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి మరింత బలోపేతమవుతుంది. రోజూ నిమ్మరసం తీసుకోవడం ద్వారా ‘విటమిన్‌ సి’ సులభంగా పొందొచ్చు. ఇదే కాకుండా ఉసిరి కచ్చితంగా తినేలా చూసుకోండి. చట్నీ, క్యాండీ, ఊరగాయ.. ఇలా ఏ రూపంలోనైనా ఉసిరి తీసుకోవడం ద్వారా ‘విటమిన్‌ సి’ పొందొచ్చు.

శ్వాస సంబంధ వ్యాయామం: మీ ఊపిరితిత్తులు సరిగా పనిచేయాలన్నా, రోగనిరోధక శక్తి బాగా ఉండాలన్నా మీరు చురుగ్గా ఉండటం చాలా ముఖ్యం. శ్వాససంబంధ వ్యాయామాలతో ఇది సాధ్యమవుంది. అలాగే, బాగా నీరు తాగాలి. ఉదయాన్నే శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయడం ద్వారా అధిక ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మనం పీల్చే గాలిలో కాలుష్య కారకాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.

తగినంత నీరు తాగండి: ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం తగినంత నీరు తాగడం ఎంతో ముఖ్యం. శరీరంలో తగినంత నీరు లేకపోతే అంతర్గత అవయవాల పనితీరు క్షీణిస్తుంది. అందువల్ల రోజంతా పానీయాలు తీసుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు మరింత బాగా పనిచేసేందుకు దోహదపడుతుంది.

బయట తిరగకపోవడమే ఉత్తమం: దీపావళి కాలుష్య ముప్పునుంచి బయటపడాలంటే ఇంటినుంచి బయటకు వెళ్లకపోవడమే ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. బయటి పరిస్థితులతో పోల్చిస్తే కాలుష్య మోతాదు ఇంట్లో కాస్త తక్కువగానే ఉంటుంది. అలాగని, కేవలం ఇంట్లోనే ఉండిపోవడం వల్ల కూడా ఊపిరితిత్తులకు సురక్షితమని చెప్పలేం. అందుకే ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫైర్లు వాడితే ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.