ETV Bharat / state

B Pharmacy Student Commits Suicide: విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్‌.. ఈతకు వెళ్లి బాలుడు మృతి - ఏపీ నేర వార్తలు

AP CRIME NEWS: నెల్లూరు జిల్లాలో ఆన్‌లైన్ గేమ్స్​కు అలవాటు పడిన విద్యార్థిని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడింది. మరో ఘటనలో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మరోవైపు సున్నం బట్టిలో పడి కార్మికుడు మృతి చెందాడు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 20, 2023, 10:01 PM IST

AP CRIME NEWS : ప్రస్తుత రోజుల్లో అందరి చేతుల్లో మొబైల్​ ఫోన్​ ఉంటుంది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు మొబైల్​ ఫోన్​కు సమయాన్ని కేటాయించి మరీ వాడుతుంటారు. ముఖ్యంగా యువత వాటికి బానిసలుగా తయారవుతున్నారు. సోషల్​ మీడియా, ఆన్​లైన్​ గేమ్స్​ అంటూ.. అర్ధరాత్రి దాటినా మెలకువగా ఉంటూ వారి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతున్నారు. పది మందికి ధైర్యం చెప్పాల్సిన ఓ వైద్య విద్యార్థిని.. తల్లిందండ్రులు మందలించారనే కారణంతో ఎవ్వరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. తల్లిందండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.

విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్‌లైన్‌ గేమ్స్‌ : నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తురకపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నెల్లూరులోని ప్రైవేట్ కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థిని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడింది. తల్లిదండ్రులు ఫీజు కట్టాలని ఇచ్చిన డబ్బుతో ఆన్‌లైన్ గేమ్స్‌ ఆడింది. అందులో 2.5 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుమార్తెను ఈ నెల 15న మందలించారు. మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. నెల్లూరు ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఈతకు వెళ్లి బాలుడు మృతి : ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివార్లలోని స్విమ్మింగ్ పూల్​లో ఈతకు వెళ్లి చరణ్ (12) మృతి చెందాడు. కళ్యాణ దుర్గం గరీబ్ నగర్​కు చెందిన ఆరో తరగతి విద్యార్థి చరణ్.. తన చెల్లి, తల్లితో కలిసి పట్టణ శివారులో ఉన్న స్విమ్మింగ్ పూల్​కు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్ రుసుము చెల్లించి ఈత నేర్చుకునే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేదని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. స్విమ్మింగ్ పూల్​ యజమాని రుసుము వసూలు చేసినా.. సరైన రక్షణ చర్యలు తీసుకోలేదని బాలుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సున్నం బట్టిలో పడి కార్మికుడు మృతి : పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన రామిశెట్టి చిన్న బ్రహ్మయ్య (37) సున్నం బట్టీలో పనికి వెళ్లి, సున్నం రాయిని బట్టిలో వేసి కూర్చునే సందర్భంలో ప్రమాదవశాత్తు లోపల పడిపోయాడు. మృతదేహం ఆనవాళ్లు కనిపించకుండా సున్నపు రాయితో కలిసి సజీవ దహనమయ్యాడు. శరీరం బూడిదగా మిగిలి పోయిందని బట్టీ కార్మికులు వివరించారు. బట్టీలో పడి కార్మికుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బట్టీ కార్మికులు విషాదంలో మునిగి పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి : అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వై రామవరం మండలం చింతలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. చింతలపూడి గ్రామానికి చెందిన రేవుల రమేష్ రెడ్డి (23), కత్తుల వీరప రెడ్డి (18) వ్యక్తిగత పనులపై చింతలపూడి నుంచి ఇవ్వంపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే వారు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై మారేడుమిల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టవర్​పై నుంచి పడి వ్యక్తి మృతి : విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద టవర్ ఎక్కి తేనె తీస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కేసరపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. టవర్ పనికి తీసుకువచ్చి, వేరొక పని చెప్పటంతో ఈ ప్రమాదం జరిగిందని మృతుని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.