నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెబుతూ.. వివిధ శాఖల అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏప్రిల్ 17 న జరిగే తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాశీ పేట కూడలి నుంచి రాజా వీధి, తూర్పు వీధుల గుండా ర్యాలీ చేశారు. పుర కమిషనర్ నాగేశ్వర రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: