నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్మన్లను కౌన్సిలర్లు ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. వైకాపాకు చెందిన గోపవరం వెంకటరమణమ్మ ఛైర్పర్సన్గా, షేక్ సర్దార్ వైస్ ఛైర్మన్ ఎన్నుకున్నారు. వారు ప్రమాణం స్వీకారం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులుండగా.. వైకాపా19, తెదేపా2, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు,జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.
ఇదీ చదవండి: కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు: సోము వీర్రాజు