ETV Bharat / state

అడుగడుగునా టీడీపీ కార్యకర్తలపై పోలీసుల ఆంక్షలు.. సోమిరెడ్డి ఆగ్రహం - Andhra Pradesh Main News

Argument between TDP leaders and police: నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో టీడీపీ నాయకులు, పోలీసులకు మధ్య గొడవ జరిగింది. వైసీపీ నాయకులు 400 మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు వెంకటాచలం వస్తుండగా నేషనల్ హైవే గొలగమూడి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకొని.. వాహనాల తాళాలు తీసుకున్నారు.

Arguement
గొడవ
author img

By

Published : Jan 11, 2023, 3:26 PM IST

Argument between TDP leaders and police: నెల్లూరు జిల్లా వెంకటాచలంలో తెలుగుదేశం సమావేశానికి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు నిలిపివేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంకటాచలం, నాయుడుపాలెం, కాకుటూరు, గొలగమూడి గ్రామాలకు చెందిన 400 మంది వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వెంకటాచలం వస్తుండగా గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై సొమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ

మంత్రి కాకాణి ఆదేశాలతోనే పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తామేమీ సభలు, ర్యాలీలు చేయడం లేదని, పార్టీ కార్యాలయంలో కూర్చుంటే తప్పేంటని నిలదీశారు. పోలీసులు అయినా అడ్డంకులు చెప్పడంతో.. సోమిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యకర్తలతో కలిసి కాస్త దూరం బైకుపైనే ప్రయాణించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.