నెల్లూరు జిల్లాలో సుమారు 70వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. తీరప్రాంత మండలాలైన ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, సర్వేపల్లి, చిల్లకూరు, కోట,వాకాడు తదితర మండలాల్లో ఎక్కువగా ఆక్వాసాగు ఉంది. 24గంటలు విద్యుత్ సరఫరా అవసరమైన ఈ రంగానికి విద్యుత్ కోతలు ప్రమాద ఘటింకలు మోగిస్తున్నాయి. కరెంట్ లేకుంటే రేడియోటర్లు పనిచేయవని.. గాలి ఆడకపోతే చెరువులోని రొయ్యలు చనిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
అధికారులకు ఈ పరిస్థితి తెలిసినా.. విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో ఇవ్వడంలేదని ఆక్వా రైతులు వాపోతున్నారు. ఎడాపెడా విద్యుత్ కోతలతో తీవ్రంగా నష్టపోతున్నామని అంటున్నారు. విద్యుత్ కోతల కారణంగా కొందరు రైతులు జనరేటర్లు పెట్టుకున్నా.. అది మరింత ఆర్థిక భారమవుతుందని అంటున్నారు. సమస్యని విద్యుత్ అధికారులకు విన్నవించినా..పట్టించుకోవడంలేదని ఆక్వా రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కరెంట్ కోతలు లేకుండా చూడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: విద్యుత్ కోతలు.. ఆక్వా రైతుల అవస్థలు