- మాండౌస్ తుపాను ప్రభావంతో.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు...
Mandous Cyclone in AP: మాండౌస్ తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల కాలనీల్లోకి నీరు చేరి జనం అవస్థలు పడుతున్నారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నదులు, వాగులు ఉద్ధృతికి కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. రాకపోకలు నిలిచి అవస్థలు పడుతున్నారు.
- ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదు: హైకోర్టు
Mahankakali Temple case: వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఓసారి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా మార్చడం అంటే కొత్తగా దేవాలయాన్ని నిర్మించినట్లు అవుతుందని పేర్కొంది. ఆ విధంగా చేయడానికి ధర్మశాస్త్రం అనుమతించడం లేదని తెలిపింది. జీర్ణోద్ధారణ కోసమైనా విగ్రహాలను/మూలవిరాట్‌ను మరో స్థానానికి తరలించకూడదని తెలిపింది. దేవాలయంలో మరమ్మతుల కోసం మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చని పేర్కొంది.
- నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి..
Brother and sister died in YSR Kadapa district: నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. మరుగుదొడ్డి కోసం తీసిన నీటి గుంతలో పడిన చిన్నారులను గమనించి స్థానికులు ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
- పాల విక్రేత నుంచి సీఎం వరకు.. హిమాచల్ నూతన ముఖ్యమంత్రి విజయ ప్రస్థానం
సుఖ్విందర్ సింగ్ సుఖు.. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయ ప్రస్థానం గురించి ఓ సారి తెలుసుకుందాం.
- వేరే మహిళతో తండ్రిని అలా చూశాడని కొడుకు దారుణ హత్య.. చేతులు నరికేసి.. ఉరేసి..
వేరే మహిళతో సన్నిహితంగా ఉండడాన్ని చూశాడన్న కారణంతో కుమారుడినే హతమార్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. మరోవైపు, 17 ఏళ్ల టీనేజర్‌ను బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
- ''సాహో' ఇషాన్ కిషన్.. 'డబుల్'తో అదరగొట్టేశావ్'
ఇషాన్ కిషన్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించి.. బంగ్లాపై మూడో వన్డేలో టీమ్ఇండియా గెలవడానికి ప్రధాన కారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు ఇషాన్ కోసం ఏమన్నారంటే?
- 'ఆరోగ్య బీమా క్లెయిం' రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ఆరోగ్య అత్యవసరం వచ్చినప్పుడు ఆదుకుంటుందని ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని అనుకున్నా సరే.. కొన్నిసార్లు బీమా సంస్థ క్లెయింను తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు ఎదురవుతాయి? ఇలాంటప్పుడు ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
- వామ్మో.. ఈ దొంగలు యమా స్పీడ్.. 60 సెకన్లలో రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లు చోరీ
ఇంగ్లాండ్‌లో సినిమా సీన్‌ను తలపించే ఓ చోరీ జరిగింది. రూ.7కోట్ల విలువైన లగ్జరీ కార్లను దుండగులు కేవలం ఒక్క నిమిషంలో చోరీ చేశారు.