నిబంధనలకు విరుద్ధంగా అవయవదానం నిర్వహించిన నెల్లూరు సింహపురి ఆసుపత్రిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ప్రకటించారు. అవయవదానం జరిగిన తీరుపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామని, వారి ఆదేశాల ప్రకారం ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆసుపత్రి పై క్రిమినల్ కేసు పెట్టామని, ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రద్దు తో పాటు, నిబంధనలకు విరుద్ధంగా అవయవదానాన్ని ప్రోత్సహించిన అయిదు మంది వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు చేసేందుకు వైద్య శాఖకు సిఫార్సు చేస్తామన్నారు. అల్లూరు మండలం ఉద్దీపగుంటకు చెందిన ఏకుల శీనయ్య గత నెల 17వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడి సింహపురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. వైద్యానికి అయిన బిల్లులు చెల్లించని పక్షంలో అవయవదానానికి అంగీకరించాలని వైద్యులు ఒత్తిడి తేవడం, దీనిపై విమర్శలు రావడంతో అధికారుల విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.
ఇవీ చదవండి