నెల్లూరు రూరల్ సబ్ డివిజన్‌కు చెందిన సంగం, వెంకటాచలం, కృష్ణపట్నంపోర్ట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా మద్యం చిక్కింది. ఆయా స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేసిన పోలీసులు అక్రమంగా తరలిపోతున్న మద్యాన్ని పట్టుకున్నారు. 5511 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సంగం వద్ద 2113 సీసాలు, కాకర్ల వారి పాలెం క్రాస్ రోడ్‌లో 2315 సీసాలు, ఏపీ జెన్కో దగ్గర1083 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 15 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. మద్యం ఎక్కడ నుంచి సరఫరా అయిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఓటర్లకు సరఫరా చేసేందుకే 2 ప్రధాన పార్టీల నేతలు ఈ మద్యం తీసుకువెళ్తున్నట్టు అనుమానిస్తున్నారు.
ఇవి చదవండి