jac meeting: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సమస్యల పరిష్కారానికి దశలవారీగా ఆందోళన చేపడుతున్నట్లు.. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు.. జేఏసీ నేతలు పెంచల్ రెడ్డి, పెంచలరావులు ప్రకటించారు. జిల్లాలోని ఎన్జీవో హోంలో.. ఉద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, కరువు భత్యం సహా పలు డిమాండ్లతో ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటంతో, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Two Class Rooms: 60మంది మించితే రెండు గదులు ఉండాలి: పాఠశాల విద్యాశాఖ