ETV Bharat / state

Anandayya Medicine : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ - Final Report : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో కరోనాకు మందు ఇస్తున్న ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్యను శనివారం తెల్లవారుజామున పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వచ్చిన సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

Final Report : నేడే తుది నివేదిక.. ఔషధ పంపిణీపై హైకోర్టులో విచారణ

author img

By

Published : May 30, 2021, 7:12 AM IST

Updated : May 31, 2021, 9:37 AM IST

ఆనందయ్య ఔషధంపై నేడు తుది నివేదిక రానుంది. మరోవైపు జిల్లాలోని కృష్ణపట్నంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. గ్రామంలోకి స్థానికేతరులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు కృష్ణపట్నం, గోపాలపురంలో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. అయినా ఇతర ప్రాంతాల నుంచి కృష్ణపట్నానికి అంబులెన్సుల్లో వచ్చేందుకు రోగులు ప్రయత్నిస్తున్నారు. అలా వచ్చే వారిని పోలీసులు వెనక్కి పంపుతున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నుంచి శనివారం ఆనందయ్యను పోలీసులు వేరే ప్రదేశానికి తరలించారు. ఆదివారం బందోబస్తు మధ్య రహస్య ప్రాంతంలో ఉంచారు.

నిర్బంధించడం విచిత్రం : తల్లోజు ఆచారి

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌ వాస్తవ మరణాలను గుర్తించాలని, ఈ విషయాన్ని బీసీ కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంటుందని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో విలేకర్లతో మాట్లాడుతూ కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందుతో చాలామందికి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఆనందయ్యను పదేపదే ఇబ్బందులు పెడుతుంటే.. ఆయన హైకోర్టులో పిటిషన్‌ వేశారని చెప్పారు.

జిల్లా అధికారులు ఆయన్ను కుటుంబసభ్యుల నుంచి దూరంగా పెట్టడం, నిర్బంధించడం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మందును ప్రసాదంలా అందరికీ పంపిణీ చేసేలా సీఎం జగన్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆనందయ్యను ఎందుకు నిర్బంధిస్తున్నారో కమిషన్‌కు జవాబు చెప్పాలని, ఆయన్ను నిర్బంధించినవారిపై కమిషన్‌ చర్యలు తీసుకుంటుందని తల్లోజు స్పష్టం చేశారు.

ఆనందయ్య మందుపై దిల్లీకి నివేదిక

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేసే మందు పనితీరుపై చేసిన అధ్యయన నివేదికను వైద్య బృందాలు దిల్లీలోని కేంద్ర ఆయుర్వేద పరిశోధన సంస్థకు ఆన్‌లైన్‌లో పంపించాయి. తిరుపతి ఆయుర్వేద వైద్యకళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థలు సేకరించిన సమాచారాన్ని నివేదిక రూపంలో కేంద్ర సంస్థకు సమర్పించాయి. అక్కడి వైద్య బృందం నివేదికను పరిశీలించి, తన అభిప్రాయాన్ని తెలియచేస్తుంది.

హైకోర్టులో విచారణ..

ఈ నేపథ్యంలో హైకోర్టులో సోమవారం ఔషధ పంపిణీపై తుది విచారణ జరగనుంది. ప్రభుత్వమే మందు పంపిణీ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో మలికార్జున, ఉమామహేశ్వరరావు అనే వ్యక్తులు.. పిటిషన్ దాఖలు చేశారు.

ఇదీ చదవండి : రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు వర్షాలు

Last Updated : May 31, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.