ఆనందయ్య ఔషధానికి ప్రభుత్వం, హైకోర్టు పచ్చజెండా ఊపడంతో.. మందు పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆన్‌లైన్‌లో అందజేసేలా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు పంపిణీపై నెల్లూరులో కలెక్టర్ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా మందు ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు.
రెండు రోజుల్లో..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు పంపిణీపై నెల్లూరులో జిల్లా ఉన్నతాధికారులతో ఆనందయ్య సమావేశమయ్యారు. ముడిసరుకు సమీకరించి రెండు, మూడు రోజుల్లో ఔషధం తయారీని ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోనా మందు తయారీకి సహకరించేందుకు పలువురు ముందుకు వస్తున్నారని చెప్పారు. తయారీ ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అధికారులు సూచనల మేరకు.. మందు పంపిణీ చేస్తామని, అవసరమైన వారందరికి ఔషధాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
ఆన్‌లైన్‌లో..
వికేంద్రీకరణ, ఆన్లైన్ పద్ధతిలో ఆనందయ్య ఔషధం పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఆనందయ్య కరోనా మందుకు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పంపిణీ విధానంపై నెల్లూరు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి లతో పాటు ఆనందయ్య హాజరయ్యారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రభుత్వ సూచనల ప్రకారం మందు పంపిణీకి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ముడి సరుకు సమీకరించి, నాలుగైదు రోజుల్లో మందు పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడించారు. వికేంద్రీకరణ ఆన్లైన్ విధానం ద్వారానే మందు పంపిణీ జరుగుతుందని, నేరుగా ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ మందు కోసం రావద్దని అధికారులు సూచించారు. అవసరమైన ప్రాంతాలకు మందు తామే పంపిణీ చేస్తామని వెల్లడించారు. కంట్లో వేసే ముందుపై ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నందున, కోర్టు తీర్పు, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి చర్యలు చేపడతామన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సూచించిన ప్రాంతంలో మందు తయారీ చేపడతామన్నారు.
నల్లమల్ల నుంచి తెప్పిస్తాం
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆనందయ్యను కలిసి అభినందించారు. ప్రకాశం జిల్లాలోనూ మందు తయారు చేయాల్సిందిగా కోరారు. అవసరమైన ముడిపదార్థాలు నల్లమల అటవీప్రాంతం నుంచి తెప్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: mercy killing: అరుణమ్మ కన్నీటి కథ.. ఈ కడుపుకోత మరెవరికీ రాకూడదు..!