రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సందేశం లేదని కృష్ణపట్నం ఆనందయ్య అన్నారు. మందు పంపిణీపై ప్రభుత్వ సహకారం కావాలంటూ ఆనందయ్య... రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 7న లేఖ రాశారు. ఔషధాన్ని ఇంటి వద్దకు పంపిణీ చేయాలంటే ప్రభుత్వ సహకారం అవసరం ఉందని.. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకుంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆనందయ్య అన్నారు.
సాయంత్రం చర్చిస్తాం..
రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పంపించాలంటే ఏమి చేయాలి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకు ఔషధ పంపిణీకి ఏలాంటి చర్యలు తీసుకోవాలి. అనే విషయాన్ని తమ బృందంతో గురువారం సాయంత్రం చర్చిస్తానని అన్నారు. తమ ట్రస్ట్ ద్వారా ప్రజలకు పంపిణీ చేయాలనే ఆలోచన చేస్తామని.. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామన్నారు.
కృష్ణపట్నంలో అందరికీ ఇప్పటికే పంపిణీ పూర్తిచేశామని. సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇప్పటికిప్పుడు 50వేల మంది పాజిటివ్ వ్యక్తులకు పంపిణీ చేసే విధంగా మందు సిద్ధంగా ఉందని తెలిపారు. కోవిడ్ రాని వారికోసం మందును తయారు చేయాల్సి ఉందని చెప్పారు.
ఇదీ చదవండి..Ap Corona Cases: కొత్తగా 8,766 కేసులు, 67 మరణాలు
Anandaiah Medicine:'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభమైంది..ఎక్కడంటే !