ఈ రబీ సీజన్లో వరి పండించే రైతులు వ్యవసాయ అధికారుల, శాస్త్రవేత్తల సూచనలతో మేలు రకాలైన విత్తనాలతో పంటల సాగు చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఆనందకుమారి తెలిపారు. ఈ సీజన్లో ప్రధానంగా రైతులు ఎన్ఎల్ఆర్ 34449, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15 048, ఏడీటీ 37939 రకాలను సాగు చేయాలని ఆమె సూచించారు. రైతులకు విత్తనాలు కావాలంటే రైతు భరోసా కేంద్రాల్లో తప్పనిసరిగా రైతు పేరు నమోదు చేయించుకోవాలన్నారు.
రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా విత్తనాలు రైతులకు అందించేందుకు 21,000 క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో రైతులకు నాణ్యమైన మంచి రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ,విత్తనాలు కావలసిన రైతులు నెల్లూరు నగరంలోని వ్యవసాయ కేంద్రంలో సంప్రదించాలని సీనియర్ శాస్త్రవేత్త వినీత తెలిపారు.