ప్రాజెక్టు భూ సేకరణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో నెల్లూరు జిల్లా కలెక్టర్ ముగ్గురు తహసీల్దార్లపై వేటు వేశారు. వీరిలో గుడ్లూరు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు తహసీల్దార్లు లావణ్య, నాగరాజు, హమీద్ ఉన్నారు. చవటపల్లి ప్రాజెక్టు భూసేకరణలో అక్రమాలకు పాల్పడడంతో సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చక్రధర్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు ఎస్ఐలు మల్లికార్జున్ రావు, నరసింహారావును వీఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. తాళ్లూరు ఎస్ఐగా బి.ప్రేమ్ కుమార్ ను నియమించారు.
నెల్లూరు జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లపై వేటు.. ఇద్దరు ఎస్ఐలపైనా చర్యలు - తహసీల్దార్లపై వేటు
నెల్లూరు జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లపై వేటు పడింది. గుడ్లూరు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు తహసీల్దార్లు లావణ్య, నాగరాజు, హమీద్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చక్రధర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారంలో అక్రమాలు అందుకు కారణమని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.
![నెల్లూరు జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లపై వేటు.. ఇద్దరు ఎస్ఐలపైనా చర్యలు suspention](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17511344-398-17511344-1673974382158.jpg?imwidth=3840)