నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బస్టాండ్ సెంటర్ నుండి సోమశిల రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మాతృభాష తెలుగును తొలగించి ఇంగ్లీష్ చేర్చటం కోసం చేసిన జీవో నెంబర్ 81ని వెంటనే రద్దు చేయాలంటూ నిరసన తెలిపారు. ఎవరికి ఇష్టమైన పద్ధతిలో వారు విద్యను అభ్యసిస్తారని... ఇలా బలవంతంగా ఇంగ్లీష్ భాషను విద్యార్థులపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. జీవోను రద్దు చేయని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: