దేశ చిత్ర పటాన్ని పాఠ్యాంశంలో తప్పుగా ముద్రించారని నెల్లూరులో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఆ చిత్రాన్ని సరిచేయాలని డిమాండ్ చేసింది. నగరంలోని వి.ఆర్.సి. సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. ఆరో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో మేరా దేశ్ మహాన్ అనే పాఠ్యాంశంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకుండానే దేశ చిత్ర పటాన్ని ముద్రించారని ఆరోపించారు.
జరిగిన పోరపాటును సరిదిద్ది, భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న దేశ చిత్ర పటాన్నే ముద్రించాలని, లేకుంటే ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి: