ETV Bharat / state

BOY DEAD: బఠాణి గింజ గొంతులో ఇరుక్కుని..ఊపిరి ఆగి - నెల్లూరు జిల్లా

రెండేళ్ల బాలుడు మృతి
రెండేళ్ల బాలుడు మృతి
author img

By

Published : Sep 17, 2021, 2:38 PM IST

Updated : Sep 17, 2021, 9:38 PM IST

14:35 September 17

రెండేళ్ల బాలుడు మృతి

రెండేళ్ల బాలుడు బఠాణీలు తినుకుంటూ ఆడుతున్నాడు. వద్దని తల్లి వారించింది. బఠాణీల ప్లేటును లాక్కుంది. దీంతో ఆ బాలుడు గుక్కపెట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. కానీ ఆ బఠాణీలే బాలుడి ప్రాణాలు తీస్తాయని ఆ తల్లి గ్రహించలేకపోయింది. 

నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మండలంలో కుర్రపల్లి బీసీ కాలనీకి చెందిన రెండేళ్ల బాలుడు కిరణ్‌ బఠాణి గింజ గొంతులో ఇరుక్కుని మృతి చెందాడు. సీతారామపురం మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన చప్పలి ఏసురత్నం, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలరు. వారిలో మూడవ సంతానమైన రెండేళ్ల కిరణ్ ఇంటి వద్ద ఆడుకుంటూ.. బఠాణి గింజలను తిన్నాడు. బఠాణీలు తినవద్దని బాలుడి వద్ద నుంచి తల్లి.. ప్లేటును లాగేసుకుంది. దాంతో బాలుడు గుక్కపట్టి ఏడవడంతో బఠాణి గింజలు గొంతులో ఇరుక్కున్నాయి. దాంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 

భయాందోళన చెందిన తల్లిదండ్రులు కుమారుడిని వైద్యం కోసం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంత సమయం ముందు తమ కళ్ల ముందు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కుమారుడి మృతదేహాన్ని తీసుకొని అయ్యవారిపల్లికి వెళ్ళిపోయారు.

ఇదీ చదవండి: CHILDREN DIED: పెన్నా నదిలో ఈతకు వెళ్లి.. గుంతలో పడి

Last Updated : Sep 17, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.