నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం నీటి సామర్థ్యాన్ని చీఫ్ ఇంజనీర్ మురళినాథ్ రెడ్డి పరిశీలించారు. కడప, కర్నూలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 60 టీఎంసీల నీరు చేరిందని, ఇన్ ఫ్లో లక్షా పదివేల వరకు కొనసాగుతోందని మురళినాథ్ రెడ్డి తెలిపారు. మరో రెండు రోజులపాటు ఇదే వరద ప్రవాహం కొనసాగితే జలాశయ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల నీరు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం నింపడానికి ఎలాంటి అడ్డంకులు లేవని, పూర్తి స్థాయిలో జలాశయాన్ని నీటి నింపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కలెక్టర్లని అప్రమత్తం చేశామని, ఎప్పటికప్పుడు జలాశయ నీటిపై పర్యవేక్షణ చేస్తున్నామని మురళినాథ్ రెడ్డి వెల్లడించారు.
ఇదీ చూడండి: