నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో శ్రీ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి దంపతుల కల్యాణోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలకు అనుగుణంగా భక్తులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్యాణాన్ని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో వెంగమాంబ, గురవయ్యనాయుడు దంపతుల కళ్యాణాన్ని ఆలయ అర్చకులు సాంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ కరుణాకర్ బాబు, ఈవో వెంకటేశ్వర్లు ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ పర్యటన