నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పాలిచర్లవారిపాళెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సమీపంలోని ఖాళీ స్థలాల్లో ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంచారు. పక్కనే నరికేసిన జామాయిల్ తోటకు నిప్పు అంటుకోవడంతో.. ఆ మంటలు సమీపంలో ఉన్న ధాన్యపు రాశులకు అంటుకున్నాయి. ఈ కారణంగా 2.88 లక్షల రూపాయలు విలువ చేసే 17 పుట్ల ధాన్యం రాశులు దగ్ధం అయ్యాయి.
మంటలు చెలరేగడంతో రైతులు, స్థానికులు ఆందోళన చెందారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు మంటలను అదుపు చేశారు. అప్పటికే సగానికి పైగా ధాన్యం కాలి బూడిదైంది. కళ్ల ముందే చేతికి అంది వచ్చిన పంట అగ్నికి ఆహుతి అవడంతో రైతులు కన్నీరుమున్నీరు అయ్యారు.
ఇదీ చదవండీ.. Anandayya Medicine: 'దైవకృపతోనే మందు తయారీ సాధ్యమైంది'