Slab of Building Under Construction Collapsed: హైదరాబాద్ కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న 5 అంతస్థుల భవనం పైకప్పులు కూలి పోయాయి. ఈ దుర్ఘటనలో శిథిలాలు మీద పడి ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడగా, ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తి శిథిలాల కింద చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహయ చర్యలు చేపట్టారు. నాసిరకం నిర్మాణం కారణంగానే భవనం పై కప్పులు కూలాయని జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
కూకట్‌పల్లిలో భవనం పై కప్పు కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. మరో కూలీ శిథిలాల కింద చిక్కుకున్నాడు. ప్రమాద స్థలానికి చేరుకున్న డీఆర్ఎఫ్ అగ్నిమాపక పోలీసు సిబ్బంది శిథిలాలు తొలగిస్తున్నారు. కూకట్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంలో మూడు అంతస్తుల వరకు పైకప్పుల నిర్మాణం కొద్దిరోజుల క్రితం పూర్తయ్యింది. కాగా.. నాలుగు, ఐదవ అంతస్తుకు ఇప్పుడు పై కప్పులు నిర్మిస్తున్నారు.
ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నాలుగు, ఐదవ అంతస్తుల పైకప్పులు పేకమేడలా కుప్పకూలాయి. ప్రమాద సమయంలో రెడీమిక్స్ సిబ్బంది ఐదుగురు పైకప్పుల కిందే నిలబడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కూలీలపై పడ్డ శిథిలాల కింద నుంచి స్థానికులు ముగ్గురిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు శిథిలాల్లో చిక్కుకుపోయారు. కొద్ది సేపటికి శిథిలాల్లో చిక్కుకున్న వారిలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
మరొకరి అచూకి తెలియాల్సి ఉంది. ఘటన స్థలంలో ఇంకా సహయ చర్యలు కొనసాగుతున్నాయి. నాసిరకం నిర్మాణం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమికంగా తేలింది. ఈ తరహా నిర్మాణాల వలన నిత్యం భయాందోళనల చెందుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి నిర్మాణాలను గుర్తించి అధికారులు కూల్చివేయాలని...అసలు వీటికి ఏ విధంగా అనుమతిస్తారని విమర్శిస్తున్నారు.
ఇవీ చదవండి: