ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM - Telugu latest news

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 16, 2022, 4:49 PM IST

  • త్వరలో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నా: హీరో మంచు మనోజ్​
    సినీ నటుడు మంచు మనోజ్​ కడప పెద్ద దర్గాను సందర్శించారు. దర్గాను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో కొత్త సినిమాలు, కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నా అని మంచు మనోజ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కూలి కన్నా దారుణంగా..ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి: బండి శ్రీనివాసరావు
    ఉద్యోగులు నెలంతా పనిచేస్తే 30న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని.. ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదని.. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వచ్చే ఏడాది "విద్యుత్ చార్జీల బాదుడే" బాదుడేనా..!
    వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల ముప్పు ముంచుకొస్తోంది. ప్రస్తుతం డిస్కంలకు 13 వేల కోట్ల రూపాయల ఆదాయ లోటు ఉండగా, ఆ మేరకు వినియోగదారులపై భారం మోపాలని భావిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రానికి అవసరమైన 76వేల 824 మిలియన్ యూనిట్ల విద్యుత్ కోసం 52 వేల 690 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుప్రీం కోర్టు సైతం బహిరంగ విచారణ చేస్తుంటే, మీరేంటీ సార్..!
    ఏపీఈఆర్​సీ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డికి ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్​ పయ్యావుల కేశవ్​ లేఖ రాశారు. ఏఆర్​ఆర్​ ప్రతిపాదనలపై బహిరంగంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు సైతం బహిరంగ విచారణ చేస్తుంటే, మీరు వీడియో విచారణకే పరిమితం కావడం ఏం..బాగోలేదని పయ్యావుల పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బిహార్​ కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం.. 53కు చేరిన మృతుల సంఖ్య
    బిహార్‌లో కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు ముమ్మరమైంది. అదనపు ఎస్పీ సారథ్యంలో ముగ్గురు డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్లు సహా 31 మందితో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సారణ్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ తెలిపారు. కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే భయపడకుండా చెప్పాలని ప్రజలను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అనారోగ్యంతో ఉన్న మనవడిని తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లిన తాత
    అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తోపుడుబండిపై తీసుకెళ్లిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ఖుషీనగర్​లో జరిగింది. రామాజ్ఞ మనవడు గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అంబులెన్స్​ సేవల పట్ల అవగాహన లేని రామాజ్ఞ తోపుడుబండిపై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పర్యటకులపై విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి..
    మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక కేంద్రంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొత్తగా మదుపు చేద్దామనుకుంటున్నారా?.. ఈ విషయాలు మీకోసమే!
    స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం ఛాయలున్నప్పటికీ.. మన దేశంపై ఆ ప్రభావం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచిస్తున్న వారు మ్యూచువల్‌ ఫండ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ దశలో ఆర్థిక లక్ష్యాల సాధనకు మదుపు చేసేటప్పుడు కొన్ని అంశాలను పరిశీలించాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ముగిసిన మూడో రోజు ఆట.. నాలుగేళ్ల తర్వాత పుజారా సెంచరీ.. బంగ్లా లక్ష్యం ఎంతంటే?
    భారత్- బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా మూడో రోజు ఆట ముగిసేసమయానికి 12 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. మిగిలిన రెండు రోజుల్లో ఇంకా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అవతార్​ 2' హంగామా.. థియేటర్​పై దాడి!
    అవతార్ 2 విడుదలతో హైదరాబాద్ లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అయితే ఓ థియేటర్​లో ​చిత్ర ప్రదర్శనకు ఆటంకం కలగడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థియేటర్​పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.