ETV Bharat / state

ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు - కీలక నిర్ణయం - GOS IN TELUGU

90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రం - తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమన్న ప్రభుత్వం

Government Orders in Telugu Language
Government Orders in Telugu Language (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 7:16 PM IST

Updated : Jan 3, 2025, 7:42 PM IST

Government Orders in Telugu: తెలుగు ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు ఇంగ్లీషు, తెలుగులోనూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకం అని తెలిపింది.

మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది. ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి దాన్ని అప్​లోడ్​ చేయాల్సిందిగా సూచించింది. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అదే ఉత్తర్వు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని సాధారణ పరిపాలన శాఖ వివిధ శాఖలకు సూచనలు చేసింది.

ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్​లేషన్​ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు.

మాతృభాష వల్లే మనకు గుర్తింపు - మహాసభలో మహిళా రచయితలు

మాతృభాషకు గత ప్రభుత్వం తూట్లు పొడిచింది - అందుకే ప్రజలు తిరస్కరించారు : మంత్రి కందుల దుర్గేశ్‌

Last Updated : Jan 3, 2025, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.