నెల్లూరు జిల్లాలో తాజాగా 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 339కి చేరింది. కరోనా నుంచి కోలుకొని 205 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఐసోలేషన్ కేంద్రాల్లో 130 మంది చికిత్స పొందుతుండగా, క్వారంటైన్ కేంద్రాల్లో 354 మంది ఉన్నారు. బెంగళూరు, విజయనగరం, శ్రీకాకుళం, చెన్నై నుంచి నెల్లూరుకు వచ్చిన తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు.
ఇది చదవండి దుర్గంపల్లిలో 2 కరోనా పాజిటివ్ కేసులు