ETV Bharat / state

Farmers Padayatra: పాదయాత్ర చేస్తున్న రైతులకు పాలాభిషేకం.. నేడు 24వ రోజు యాత్ర

Amaravati farmers padayatra: మూడు రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధమవుతామని అమరావతి పరిరక్షణ ఐక్య వేదిక ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో మహాపాదయాత్ర కొనసాగిస్తున్న రైతులు, మహిళలకు.. నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జీ అరవిందబాబు పాలాభిషేకం చేసి, 3 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.

Farmers Padayatra
పాదయాత్ర చేస్తున్న రైతులకు పాలాభిషేకం.. నేడు 24వ రోజు యాత్ర
author img

By

Published : Nov 24, 2021, 7:05 AM IST

Updated : Nov 24, 2021, 10:39 AM IST

పాదయాత్ర చేస్తున్న రైతులకు పాలాభిషేకం.. నేడు 24వ రోజు యాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర(24th day Amaravati farmers mahapadayatra) అలుపెరగకుండా సాగిపోతోంది. 24వ రోజులో భాగంగా మహాపాదయాత్రలో కాళ్లు బొబ్బలెక్కిన రైతుల పాదాలకు నెల్లూరు జిల్లా నరసరావుపేట తెదేపా ఇన్‌ఛార్జీ అరవిందబాబు పాలాభిషేకం చేశారు. అలాగే 3 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. నేడు సున్నపు బట్టీ నుంచి రాజుపాలెం వరకూ 14కిలోమీటర్ల మేర నడక సాగనుంది. దారి పొడవునా లభిస్తున్న అపూర్వ ఆదరణతో.. ఉద్యమకారులు ఉత్సాహంగా నడక సాగిస్తున్నారు.

23వ రోజు బోగోలు మండలం కొండ బిట్రగుంట నుంచి దగదర్తి మండలం సున్నంబట్టి వరకు సుమారు 15కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. దారి వెంట స్థానికులు మంచినీరు, మజ్జిగ ఇస్తూ.. రైతులకు సంఘీభావం తెలిపారు. పోలీసులు డప్పు, ఇతర వాద్య కళాకారులను అడ్డుకోగా.. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు సమయమనం పాటిస్తూ ముందుకు సాగారు. యాత్ర మొత్తం జాతీయ రహదారిపై జరిగినప్పటికీ సమీపంలోని గ్రామాల ప్రజలు.. రోడ్డు వరకు వచ్చి సంఘీభావం తెలిపారు. జై అమరావతి అని నినాదాలు చేసారు. పలు చోట్ల విద్యార్థులూ యాత్రలో పాల్గొన్నారు.

కడనూతల గ్రామంలో మహిళలు రైతులు, పిల్లలు, యువత పూలతో జై అమరావతి, జైజై అమరావతి(Amaravati farmers mahapadayatra) అని రోడ్డుపై రాసి స్వాగతం పలికారు. కోవూరుపల్లి వాసులు ఘన స్వాగతం పలికారు. కప్పరాళ్లతిప్పలో మత్స్యకారులు రైతులకు సంఫీుభావంగా ఉలవపాళ్ల వరకూ.. పాదయాత్రలో పాలుపంచుకున్నారు. ఇస్కపాళెం నుంచి మత్స్యకారులు, మహిళలు వచ్చి సంఫీభావం తెలిపారు. కర్నూల్, నంద్యాల నుంచి వచ్చిన రైతులు అమరావతే అందరికీ ఆనువైన రాజధానిగా పేర్కొన్నారు.

కడపకు చెందిన ఓ వ్యాపారవేత్త.. కడనూతల వద్ద రైతులను కలిసి 250 చలికోట్లు అందజేశారు. పేరు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. తెదేపాజాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర దంపతులు.. 3 లక్షల చెక్కు అమరావతి ఐకాస సభ్యులకు అందజేసారు. ప్రతి గ్రామంలోను ఆర్థిక స్తోమతను బట్టి సాయం చేసారు.

ఇదీ చదవండి..: Amaravati Padayatra: సంకల్పం సడల లేదు..జోరు తగ్గలేదు..సమరోత్సాహంతో రైతు పాదయాత్ర

Last Updated : Nov 24, 2021, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.