ETV Bharat / state

వేసవిలో ఉల్లాసం... విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం చిన్నారుల ఆటలతో సందడిగా మారింది. వేసవి సెలవుల్లో క్రీడాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరాల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు  ఉత్సాహంగా పాల్గొంటున్నారు. 13మంది ప్రత్యేక క్రీడా నిపుణులు, 22 రకాల క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు.

author img

By

Published : May 6, 2019, 3:26 PM IST

చిన్నారులు
ఉల్లాసంగా... ఉత్సాహంగా

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మైదానం రాష్ట్రంలోని పెద్ద క్రీడా మైదానాల్లో ఒకటి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ మైదానంలో... జాతీయస్థాయి క్రికెట్ మైదానం, బాస్కెట్‌బాల్, వాలీబాల్ క్రీడలకు ప్రత్యేక కోర్టులున్నాయి. వేసవి దృష్ట్యా ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసిన క్రీడా శాఖ... 22 రకాల క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ప్రతి క్రీడకూ ప్రత్యేక స్థలం కేటాయించారు. విద్యార్థులు ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ తీసుకుంటూ హుషారుగా పాల్గొంటున్నారు.

అకాడమీ స్థాయి ఆటలకు ఎంపిక
జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశాల మేరకు శిక్షణకు వచ్చే విద్యార్ధుల కోసం చక్కటి ఏర్పాట్లు చేశారు. వైద్య సదుపాయంతో పాటు... చల్లని తాగునీరు, ఓఆర్​ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. స్వచ్ఛంద సంస్థలు యువ క్రీడాకారులకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి... విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు జాన్‌ 12న ధ్రువపత్రాలు అందిస్తారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అకాడమీ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు.

Intro:ap_rjy_36_06_vana vehaaram_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:వేసవి విడిదిగా వన విహారం

Conclusion:తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం కోరంగి మడ అడవులు ప్రత్యేకత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.