ETV Bharat / state

ఐపీపీబీ విభాగంలో రాష్ట్రానికి 14 అవార్డులు

ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్​ వార్షికోత్సవంలో, రాష్ట్రం నుంచి అత్యధిక ఐపీపీబీలో అకౌంట్స్ ఓపెన్ చేయించిన వారికి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్  చేతుల మీదుగా..అవార్డులు ప్రధానం చేశారు. రాష్ట్రం నుంచి 14 మంది ఈ అవార్డులు సొంతం చేసుకున్నారు.

author img

By

Published : Sep 9, 2019, 5:36 PM IST

Updated : Sep 9, 2019, 9:36 PM IST

12 మందికి ఐపీపీబీ అవార్డులు...
12 మందికి ఐపీపీబీ అవార్డులు...

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని... దిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. పోస్టల్ బ్యాంకును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేషంగా కృషి చేసిన వారికి... కౌన్ బనేగా బాహుబాలి, ఆజ్ కా బాద్ షా, సాక్షం గ్రామ్ పేరుతో అవార్డులను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అందజేశారు. మూడు విభాగాల్లో కలిపి రాష్ట్రానికి మొత్తం 14 అవార్డులు దక్కాయి. 10 అవార్డులు ఆజ్ కా బాద్ షా, రెండు కౌన్ బనేగా బాహుబలి, మరో రెండు సాక్షం గ్రామ్ కింద ఏపీకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు సేవలను దేశమంతా ప్రారంభించింది. చిన్న మొత్తాల పొదుపు, ఉపాధి హామీ కూలీల వేతనాలు, భరోసా పింఛన్లు తదితర సేవలను అందించేందుకు పోస్టల్ బ్యాంకుల్లో ఖాతాలను ప్రారంభించారు.

.ఇదీ చూడండి: నా చిన్ననాటి కల.. ఇప్పుడు నెరవేరింది: ఉపరాష్ట్రపతి

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_03_left_parties_protest_against_banks_mergers_abb_AP10148
( ) జాతీయ బ్యాంకుల విలీనీ కరణ కు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. రానున్న కాలంలో బ్యాంకులను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు బ్యాంకులను విలీనం చేస్తున్నారని వామపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు.

Body:విశాఖ సీతమ్మధారలోని ఆంధ్ర బ్యాంకు ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ), భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపిఎం) బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రుల ఆత్మ అభిమానానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్ర బ్యాంకును యూనియన్ బ్యాంకు లో విలీనం చేయడం ఈ ప్రాంత ప్రజల, ఈ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని వామపక్ష నేతలు దుయ్యబట్టారు.

Conclusion:జాతీయ బ్యాంకుల పరిరక్షణ కోసం తుదకంటా పోరాడుతామని వామపక్ష నేతలు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెవి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి. హెచ్. నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

బైట్స్:1.జె.వి.సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సి.పి.ఐ.
2:సి.హెచ్.నరసింగరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సి.పి.ఎం.
(సార్, ఈ ఐటమ్ కి సంబంధించిన బైట్స్ ఫైల్ ఇదే నంబంర్తో పంపాను, గమనించగలరు.)
Last Updated : Sep 9, 2019, 9:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.