ముఖ్యమంత్రి జగన్ గత ఏడాది అక్టోబర్ లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ… నెల్లూరులో 104 సిబ్బంది ఆందోళన చేపట్టారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో 104 సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
2008లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమను 104 లో సిబ్బందిగా నియమిస్తే, ప్రస్తుతం ఆయన తనయుడి కారణంగా వీధిన పడే పరిస్థితి వచ్చిందని... 104 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆ అపవాదును మూటగట్టుకోకుండా తమకు న్యాయం చేయాలని కోరారు.