ETV Bharat / state

దసరా ధమాకా: నియోజకవర్గాల వారీగా ప్రగతి ప్రణాళిక.. అధికారుల కసరత్తు

దసరా ధమాకా.. దీపావళి ప్రత్యేకం.. పండుగ ఏదైనా ప్రగతికి బాటలు వేస్తున్నారు.. ప్రాంతాల వారీగా సమగ్రాభివృద్ధి సాధించే క్రమంలో జిల్లా అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రూ.100 కోట్లు వెచ్చించి నియోజకవర్గాల వారీగా అభివృద్ధికి పూనుకున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి చర్యలను వేగవంతం చేసింది.

100 cr fund for nellor
నియోజకవర్గాల వారీగా ప్రగతి ప్రణాళిక
author img

By

Published : Oct 25, 2020, 4:59 PM IST

ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి చర్యలను వేగవంతం చేసింది. జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున వెచ్చిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో మెటీరియల్‌ కాంపొనెంట్‌ కింద ఉన్న సొమ్మును ఈ మేరకు వెచ్చిస్తుండటం విశేషం. జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఈ అంశంపై ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఏఏ పనులు చేపట్టాలన్న దానిపై ప్రణాళికలు సేకరిస్తున్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇప్పటివరకు అయిదు నియోజకవర్గాల వివరాలు అధికారులకు అందినట్లు తెలుస్తుండగా.. మిగతా వాటి వివరాలు అందాల్సి ఉంది. అవి రాగానే ఆ పనులను పరిశీలించి ఆమోదముద్ర వేయనున్నారు. సీసీ రోడ్లు, కాలువలు, ఆర్‌బీకేలు, సచివాలయాల భవనాలు.. ఇలా అనేక నిర్మాణాలకు ఈ సొమ్మును వెచ్చించనున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ రూ.5 కోట్లు..

ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గానికి అందిస్తున్న రూ.10 కోట్ల సొమ్ము సద్వినియోగం చేసుకుంటే.. మళ్లీ మరో రూ.5 కోట్లు చొప్పున ఇచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. తద్వారా మరికొన్ని పనులు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నది వారి వాదన. తక్కువ వ్యవధిలోనే జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.150 కోట్ల మేర నిధులు వెచ్చిస్తుండటం కీలకంగా మారింది. ఈ విషయమై కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబుతో ‘ఈటీవీ భారత్​’ మాట్లాడగా.. ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగంగా ఈ మేరకు నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి...

రహదారులు అస్తవ్యస్తం...వానదారులకు తప్పని ఇక్కట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.