ETV Bharat / state

Tribes protest: 'నష్టపరిహారం చెల్లించాకే నిర్మాణ పనులు చేపట్టాలి'

మన్యం జిల్లా టేకరఖండిలో ఇంజినీరింగ్ కళాశాల పనులను సీపీఎం ఆధ్వర్యంలో గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న మా భూములకు నష్టపరిహారం చెల్లించాకే కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు డిమాండ్​ చేశారు.

Tribes protest at GIRIJANA UNIVERSITY
Tribes protest at GIRIJANA UNIVERSITY
author img

By

Published : Jun 25, 2022, 8:07 PM IST

'నష్టపరిహారం చెల్లించాకే నిర్మాణ పనులు చేపట్టాలి'

Tribes protest at Tekarakhandi: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం టేకరఖండిలో సీపీఎం ఆధ్వర్యంలో గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. స్థానికంగా జరుగుతున్న గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణ పనుల్ని అడ్డుకున్నారు. ఇక్కడి భూముల్లో ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేస్తుకుంటున్నారని.. వారికి నష్టపరిహారం చెల్లించకుండా నిర్మాణ పనులు చేపట్టొద్దని, తక్షణమే ఆపాలని గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. పరిహారం చెల్లించాకే ఇంజినీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరారు. లేదంటే పనులు జరగనివ్వబోమని హెచ్చరించారు.

కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాల కోసం టేకరఖండి, చంద్రశేఖరరాజుపురం గిరిజన రైతుల నుంచి ప్రభుత్వం దాదాపు 34 ఎకరాలు సేకరించింది. అయితే వారందరికీ సమీపంలోని కొండపై స్థలాలు చూపింది. ఆ స్థలాలు తమకు వద్దని.. పరిహారం చెల్లించాలని కోరుతూ.. వారంతా ఏడాదిగా ఉద్యమిస్తున్నారు. అనేకమార్లు ధర్నాలు, ర్యాలీలు చేపట్టినా అదికారుల నుంచి స్పందన లేదు. దీంతో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, మంత్రి స్పందించి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.