Tribal farmers Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని.. పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.. నాయకులను పోలీస్టేషన్‌కు తరలించారు.
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని మనకాబడి, ఓట్టిగడ్డ, రాళ్లగడ్డలపై రిజర్వాయర్ నిర్మించాలని.. చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం గిరిజన సంఘం ధర్నాకు పిలుపునిచ్చాయి. ముందుగా పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీ చేపట్టారు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నేతలను వాహనాల్లో పోలీస్ స్టేషన్ తరలించారు. రైతులు, గిరిజనులు నినాదాలు చేస్తూ కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ కొద్ది సమయం నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చదవండి