ETV Bharat / state

Three People Died After Bike Fell into Valley at AOB: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురు యువకులు మృతి - ap news

Three People Died After Bike Fell into Valley at AOB: పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో స్కూటీ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Two_Wheeler_Fell_in_valley_at_AOB
Two_Wheeler_Fell_in_valley_at_AOB
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 10:54 AM IST

Three People Died After Bike Fell into Valley at AOB : మృత్యువుకు కన్ను కుట్టిందేమో.. ఒకేసారి ముగ్గురి యువకుల ప్రాణాలు తీసింది. వారే సర్వస్వంగా.. ఎన్నో ఆశలు పెట్టుకుని.. తమను కళ్లకు రెప్పలా చూసుకుంటారని.. జీవిస్తున్న కన్నవారికి గర్భశోకం మిగిలింది. ఆ మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన ఎదిగొచ్చిన తమ పిల్లలు మృత్యు ఒడిలోకి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీటిని ఆపడం ఎవరి వల్ల కావడం కాలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Two Wheeler Fell in valley at AOB : పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దబ్బగడ్డ పంచాయతీ అనసభద్ర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. బుధవారం స్వగ్రామం నుంచి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామం అయిన నాగలిబెడ్డ, బొరిగి వైపు వ్యక్తిగత పనులపై స్కూటీపై వచ్చారు. పని పూర్తి చేసుకోని తిరుగు ప్రయాణంలో వస్తుండగా కేసలి సమీపంలో ఘాట్‌ రోడ్డులో ఉన్న ఓ మలుపు వచ్చింది. ఈ మలుపు వద్ద స్కూటీ అదుపు తప్పి.. 100 అడుగుల లోయలో పడిపోయారు.

Bus Falls From Flyover Viral Video : ఫ్లైఓవర్​పై​ నుంచి కిందపడ్డ RTC బస్సు.. ఆస్పత్రిలో 20మంది.. డ్రైవర్​ నిద్రమత్తే కారణం!

గ్రామంలో అలముకున్న విషాదఛాయలు : ఈ ప్రమాదంలో గ్రామ వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న జన్ని బాలరాజు (21), మర్రి శివ (21) మర్రి జయరాజు (22) మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న ఒడిశాలోని నారాయణపట్నం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను నారాయణపట్నం తరలించి కేసు నమోదు చేశారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోవడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుని తెలుసుకునికన్నీటి పర్యంతం అయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ప్రమాదంలో మృతి చెందిన యువకులు
ప్రమాదంలో మృతి చెందిన యువకులు

ఒక్కోక్క కుటుంబానిది ఒక్కో గాథ : గ్రామ వాలంటీరు బాలరాజు తల్లిదండ్రులు నారాయణ, రత్నాలు వ్యవసాయ కూలీలు. వారికి ఒక్కడే కుమారుడు. అన్నీ తానై చూసుకుంటాడని అనుకున్న తల్లిదండ్రులకుకన్నీటి వ్యధే మిగిలింది. ఇక.. జయరాజు తన తండ్రిని పదేళ్ల కిందట మృతి చెందారు. తల్లి తెరిజాతో కలసి జీవినం సాగిస్తున్నారు. ఉన్న ఒక్క కుమారుడిని చూస్తూ మురిసిపోయే ఆ తల్లికి విధి గర్భశోకం మిగిల్చింది. శివకు తల్లి మర్రి నల్లమ్మ, అన్నయ్య శంకరరావు ఉన్నారు. నాలుగు సంవత్సరాల కిందట తండ్రి అప్పన్న మృతి చెందారు. రెండు సంవత్సరాల కిందట కిందట అక్క భవానీ మృతి చెందింది. తల్లి నల్లమ్మ తన కుమారుడు శివతో కలసి జివిస్తోంది. బిడ్డపై ఎన్నో కలలు కన్న ఆ మాతృమూర్తికి పుత్రశోకం తప్పలేదు.

Road Accidents in AP: రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు.. తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.