ETV Bharat / state

TDP Cheif Chandrababu Projects Tour: ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: చంద్రబాబు

TDP Cheif Chandrababu visited Thotapalli project: టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీళ్లంటూ పెద్దిరెడ్డి రూ.6వేల కోట్ల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఉన్న 13 ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు.

TDP Cheif
TDP Cheif
author img

By

Published : Aug 9, 2023, 9:26 PM IST

Updated : Aug 9, 2023, 10:08 PM IST

TDP Cheif Chandrababu visited Thotapalli project: ''ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి నీళ్లు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కలిపితే కరవు సమస్య ఉండదు. ఉత్తరాంధ్రలో ఉన్న 13 ప్రాజెక్టులను ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. తోటపల్లి ప్రాజెక్ట్ తెలుగుదేశం తెచ్చింది కాబట్టే దాని నిర్వహణను గాలికొదిలేశారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టును నేను కట్టాననే అక్కసుతోనే దానిని కూడా మూలన పడేశారు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా లక్షా 80వేల ఎకరాలు నీరు పారాల్సి ఉండగా.. కాల్వల మరమ్మతులు లేని కారణంగా సరిపడా నీరందటం లేదు. ప్రాజెక్టుల విషయంలో ఈ జగన్ ప్రభుత్వం పడకేసి.. రివర్స్ గేరులో నడుస్తోంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తరాంధ్రలో 13 ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది: చంద్రబాబు

Chandrababu Projects Tour: 9రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు యుద్ధభేరి పర్యటన.. 'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీ నుంచి పది రోజులపాటు పర్యటన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 8రోజులు పూర్తి చేసుకున్న చంద్రబాబు యుద్ధభేరి పర్యటన.. నేటితో 9వ రోజుకు చేరుకుంది. ఈ 9వ రోజు పర్యటన ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొనసాగింది. నేటి పర్యటనలో పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. అనంతరం ప్రాజెక్టు వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆ తర్వాత గరుగుబిల్లి మండలం ఎర్రన్నగుడిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని.. చంద్రబాబు ప్రసంగించారు.

Chandrababu Reaction on Attempt to Murder Case: నాపైనే దాడి చేసి.. హత్యాయత్నం కేసా..?: చంద్రబాబు

Chandrababu Fire on Minister Peddireddy: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్.. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా నీళ్లంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.6వేల కోట్ల అవినీతికి తెరలేపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఓ వైపు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తూ.. మరోవైపు పెద్దిరెడ్డి రూ.600 కోట్ల బిల్లులు క్లియర్ చేశారని ఆరోపించారు. పులివెందుల చక్రాయపేట నుండి కదిరి మీదుగా తంబల్లపల్లికి నీటి తరలింపు పేరుతో ముఖ్యమంత్రి జగన్.. మంత్రి పెద్దిరెడ్డికి 5,036 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేశాడని చంద్రబాబు ఆక్షేపించారు. 10శాతం పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేయకుండా.. కొత్త కాలువలు తవ్వుతానని పెద్దిరెడ్డి ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు విమర్శించారు.

TDP Leaders Fire on CM Jagan : 'షేమ్ ఆన్ యూ జగన్ రెడ్డీ..' చర్యకు ప్రతి చర్య తప్పదని టీడీపీ హెచ్చరిక

వైసీపీ నేతల వల్ల తీవ్ర అన్యాయం జరిగింది.. ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని గిరిజనులు, మహిళలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వల్ల అన్యాయం జరిగిందని గిరిజన మహిళ వాపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పుష్ప శ్రీవాణి రేషన్ డిపోను రద్దు చేయించారని గిరిజన మహిళ ఆవేదన చెందారు. దీంతో స్పందించిన చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన మహిళలు విన్నవించిన సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆవులపల్లి రిజర్వాయర్‌లో మంత్రి పెద్దిరెడ్డి దారుణంగా అక్రమాలకు పాల్పడ్డారు. పీఎల్‌ఎన్‌ ద్వారా ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టులు చేపట్టారు. పర్యావరణ అనుమతులు, పరిహారం లేకుండా పనులు అప్పగించారు. పరిహారం కోసం ఆందోళన చేసిన రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టారు. రైతుల ఫిర్యాదుతో జలవనరుల శాఖకు రూ.100 కోట్ల జరిమానా విధింపబడింది. పెద్దిరెడ్డి రిజర్వాయర్ల పనులు నిలిపివేసేలా ఆదేశాలు వచ్చాయి. అవినీతిని బయటపెట్టాననే నాపై దాడి చేసి, నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. గిరిజన మహిళల్ని వేధిస్తున్న ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాలి. -నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

Murder Attempt Case On Chandrababu: చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు

Last Updated : Aug 9, 2023, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.